లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత
- ఆసుపత్రిలో చికిత్స... డిశ్చార్జి
- విజయవాడలోని లోక్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా పరామర్శ
- గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
- గవర్నర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్ష
ఈ సందర్భంగా గవర్నర్‌ను పరామర్శించిన చంద్రబాబు, ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, విధులకు హాజరు కావాలని ఆకాంక్షించారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన గవర్నర్, చికిత్స అనంతరం కోలుకుని లోక్ భవన్‌కు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక పరామర్శ మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి.