నెట్ ఫ్లిక్స్ సెంటర్ కి హారర్ కామెడీ థ్రిల్లర్ .. 'రాకాస'
- ఏప్రిల్ 3న విడుదలైన 'రాకాస'
- థియేటర్స్ నుంచి వచ్చిన హిట్ టాక్
- నెట్ ఫ్లిక్స్ చేతికి ఓటీటీ హక్కులు
- త్వరలోనే అందుబాటులోకి రానుందని టాక్
సంగీత్ శోభన్ - నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లకు వచ్చింది. కంటెంట్ కనెక్ట్ కావడంతో, ఈ సినిమా గట్టిగానే వసూలు చేసింది. నిహారిక కొణిదెలకి ఈ విజయం మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. ఈ నెల చివరివారంలోగానీ .. మే మొదటివారంలోగాని ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.
కథానాయకుడైన వీరూ, తాను ప్రేమించిన అమ్మాయి కోసం విదేశాల నుంచి వస్తాడు. ఆమెకి మరొకరితో పెళ్లి జరగనుందని తెలిసి బిత్తరపోతాడు. ఆ పెళ్లిని ఆపేయడం కోసం చేసే ప్రయత్నంలో సుబ్బలక్ష్మితో ప్రేమలో పడతాడు. ఆ ఊరు ఆచారం ప్రకారం వీరూ రాక్షస గుహలోకి అతనికి ఆహారంగా వెళ్లవలసి వస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? అతనిని కాపాడటం కోసం సుబ్బలక్ష్మి ఏం చేస్తుంది? అనేది కథ.