పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు

Janasena followers performed prayers at Kondagattu temple for recovery of Pawan Kalyan
  • అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్... హైదరాబాదులో శస్త్రచికిత్స
  • పవన్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన జనసైనికులు
  • పూజలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుతూ చొప్పదండి నియోజకవర్గ జనసేన శ్రేణులు జగిత్యాల జిల్లాలోని ప్రఖ్యాత కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని జనసేన నేతలు స్వామిని కోరుకున్నారు. 


ఈ పూజల్లో మొగిలిపాలెం రమేశ్, తడగొండ నర్సింగ్ బాబు, దూడం శ్రీనాథ్, కనకట్ల శ్రీనివాస్, పలువురు జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంజన్న అంటే ఎంతటి అపారమైన నమ్మకమో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే క్షేత్రంలో ఆయన కోసం పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Go Back to Shorts
Janasena
Pawan Kalyan
Kondagattu

More Telugu News