పురుషుల్లో జ్ఞాపకశక్తి తగ్గడానికి ఉప్పు కారణమా?

Memory Loss Linked to Salt Intake in Men Study Finds
  • ఆస్ట్రేలియాలోని ఈడీత్ కోవాన్ యూనివర్సిటీ పరిశోధనలో కీలక విషయాలు
  • ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల పురుషుల్లో జ్ఞాపకశక్తి వేగంగా క్షీణిస్తుందన్న అధ్యయనం
  • గత అనుభవాలను గుర్తుంచుకునే సామర్థ్యంపై ఉప్పు ప్రభావం చూపుతుందని వెల్లడి
ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో జ్ఞాపకశక్తి వేగంగా క్షీణిస్తుందని ఆస్ట్రేలియాలో జరిగిన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. మెదడు ఆరోగ్యంపై మనం తీసుకునే ఆహారం ఎంత ప్రభావం చూపుతుందో ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా, వ్యక్తిగత అనుభవాలు, గత సంఘటనలను గుర్తుంచుకునే సామర్థ్యం (ఎపిసోడిక్ మెమరీ)పై అధిక సోడియం ప్రతికూల ప్రభావం చూపుతుందని బుధవారం ఈడీత్ కోవాన్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 1,208 మందిపై 72 నెలల (6 ఏళ్లు) పాటు నిరంతర పర్యవేక్షణ జరిపారు. వారి ఆహారపు అలవాట్లను, జ్ఞాపకశక్తి మార్పులను విశ్లేషించారు. అధికంగా ఉప్పు తీసుకున్న పురుషుల్లో జ్ఞాపకశక్తి వేగంగా తగ్గినట్టు గుర్తించారు. అయితే, మహిళల్లో మాత్రం ఇలాంటి సంబంధం కనిపించకపోవడం గమనార్హం.

శరీరానికి సోడియం అవసరమే అయినప్పటికీ, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని ఇప్పటికే రుజువైంది. మెదడులో వాపు, రక్తనాళాలు దెబ్బతినడం, మెదడుకు రక్త ప్రసరణ తగ్గడం వంటి కారణాల వల్ల జ్ఞాపకశక్తిపై ప్రభావం పడొచ్చని పరిశోధకురాలు సమంత గార్డెనర్ అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఉన్న కచ్చితమైన కారణాలపై మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉందన్నారు.

ఇదే సమయంలో, ఇజ్రాయెల్‌లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం.. కాలక్రమేణా జ్ఞాపకాలు మసకబారినా, ఒక సంఘటనను ఎందుకు గుర్తుంచుకున్నామో చెప్పే వివరణలు మాత్రం స్థిరంగా ఉంటాయని తేలింది. జ్ఞాపకంపై విశ్వాసం తగ్గినా, దానికి ఇచ్చే కారణాలు మాత్రం బలంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.
Go Back to Shorts
Memory Loss
Men's Health
Salt Intake
Sodium
Episodic Memory
Brain Health
Diet and Memory
Australian Study
Edith Cowan University
High Blood Pressure

More Telugu News