పవన్ నాకు ఒక శిఖరంలా కనిపించారు... కర్మయోగిని చూశాను: దర్శకుడు బాబీ

Pawan Kalyan is like a mountain to me says Bobby
షార్ట్స్‌లో చూడండి

సినిమా రంగంలో రారాజుగా వెలిగినా, నేడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా.. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని ప్రముఖ దర్శకుడు బాబీ కితాబునిచ్చారు. 


ఎక్స్ వేదికగా బాబీ స్పందిస్తూ... "ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం... గతంలో ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు... ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషిలా కనిపించారు... రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూశాం... కానీ అన్ని సౌకర్యాలని వదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు. 


అక్కడ ఉన్నంత సేపు ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరగా ఒక్క మాట చెబుతున్నాను... జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం. జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను" అని ప్రశంసించారు.

Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Deputy Chief Minister
Bobby Kolli
Director Bobby
TDP
Janasena
Politics
Karma Yogi
Political life

More Telugu News