చంద్రుడి వెనకవైపు ఎలా ఉంటుందంటే.. ఫొటోలు ఇవిగో!
మానవ అంతరిక్ష ప్రయాణ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం నమోదైంది. నాసా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఓరియన్ నౌక చంద్రుడి ఉపరితలానికి అత్యంత చేరువగా వెళ్లి అరుదైన రికార్డులను సృష్టించింది. ఏప్రిల్ 6న జరిగిన ఈ చరిత్రాత్మక ‘ఫ్లైబై’తో లూనార్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పటివరకు ఏ వ్యోమగామి ప్రయాణించనంత దూరం అంతరిక్షంలోకి ప్రయాణించి ఈ నలుగురు వ్యోమగాములు సరికొత్త చరిత్రను సృష్టించారు.
ఈ ప్రయాణంలో ఓరియన్ నౌక భూమి నుంచి గరిష్టంగా 2,52,756 మైళ్ల (4,06,771 కి.మీ.) దూరానికి చేరుకుంది. మానవ సహిత అంతరిక్ష ప్రయాణాల్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక దూరం ఇదే కావడం విశేషం. రాత్రి 7 గంటల సమయంలో చంద్రుడి ఉపరితలానికి కేవలం 4,067 మైళ్ల దూరంలోకి నౌక చేరుకోగా, సరిగ్గా 2 నిమిషాల తర్వాత భూమి నుంచి అత్యంత గరిష్ట దూరానికి చేరుకున్నట్లు నాసా వెల్లడించింది. భూమికి అత్యంత దూరంగా, చందమామకు అత్యంత దగ్గరగా జరిగిన ఈ ప్రయాణం అద్భుతమైన పరిశోధనలకు వేదికైంది.
ఓరియన్ నౌక చంద్రుడి వెనుక భాగానికి వెళ్లినప్పుడు, హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్‌తో సంబంధాలు సుమారు 40 నిమిషాల పాటు పూర్తిగా తెగిపోయాయి. ఇది ముందుగా నిర్ణయించిన ‘కమ్యూనికేషన్ అవుటేజ్’ అయినప్పటికీ, అంతరిక్షంలో ఆ నిశ్శబ్దం ఉత్కంఠను రేకెత్తించింది. తిరిగి భూమితో సంబంధం ఏర్పడిన తర్వాత వ్యోమగామి క్రిస్టినా కోచ్ స్పందిస్తూ.. ‘భూమితో మళ్లీ సంబంధం ఏర్పడటం చాలా సంతోషంగా ఉంది’ అని భావోద్వేగంతో పేర్కొన్నారు.
చంద్రుడి వెనుక భాగంలో ప్రయాణిస్తున్న సమయంలో వ్యోమగాములు తమ పరిశీలనలను రికార్డ్ చేశారు. చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత దగ్గరగా ఫోటోలు తీస్తూ.. అక్కడి అగ్నిపర్వత బిలాలు, ప్రాచీన లావా ప్రవాహాలు, లోతైన పగుళ్లు మరియు కొండల వంటి నిర్మాణాలను క్షుణ్ణంగా విశ్లేషించారు. ఉపరితలంపై రంగులు, కాంతి తీవ్రత మరియు ఆకృతిలో ఉన్న మార్పులను వారు గమనించారు. ఈ సమాచారం చంద్రుడి నిర్మాణం, పుట్టుకను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఎంతో సహాయపడుతుంది.
ఈ అరుదైన ప్రయాణంలో వ్యోమగాములు ‘ఎర్త్‌రైజ్’ ‘ఎర్త్‌సెట్’ వంటి అద్భుత దృశ్యాలను వీక్షించారు. చంద్రుడి హోరైజన్ కిందకు భూమి అస్తమించడం, మళ్లీ అంతరిక్ష నౌక అవతలి వైపు నుంచి బయటకు వచ్చినప్పుడు భూమి ఉదయించడం వంటి దృశ్యాలను వారు కళ్లారా చూశారు. అదే సమయంలో చంద్రుడు, సూర్యుడు, అంతరిక్ష నౌక ఒకే సరళరేఖలోకి రావడంతో సుమారు గంటసేపు సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం వారికి దక్కింది. ఈ గ్రహణ సమయంలో సూర్యుని వెలుపలి వాతావరణం ‘కరోనా’ను వారు లోతుగా అధ్యయనం చేశారు.
చంద్రుడి చీకటి భాగంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఉపరితలాన్ని అత్యంత వేగంగా తాకిన ఆరు ఉల్కల వల్ల కలిగిన కాంతి మెరుపులను వ్యోమగాములు స్పష్టంగా గుర్తించారు. మిషన్ కమాండర్ రీడ్ వైస్‌మ్యాన్ మాట్లాడుతూ.. ‘మానవమాత్రులెవరూ చూడని అద్భుత దృశ్యాలను మేము చూశాం’ అని ఉద్వేగంగా చెప్పారు. పైలట్ విక్టర్ గ్లోవర్ సైతం ఈ అనుభూతిని మాటల్లో వర్ణించడం కష్టమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయవంతంగా చంద్రుడి ఫ్లైబైని పూర్తి చేసుకున్న ఓరియన్, ఇప్పుడు సురక్షితంగా భూమికి తిరుగు ప్రయాణమైంది.