Bushehr Nuclear Power Plant: ఇరాన్ బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణి దాడి

Missile Attack Targets Irans Bushehr Nuclear Power Plant
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా ఈ క్షిపణి దాడి జరిగిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపింది. క్షిపణి శకలం తగిలి సిబ్బందిలో ఒకరు మృతి చెందినట్లు వెల్లడించింది. ఆ ప్రాంతంలోని భవనం కూడా దెబ్బతిన్నదని తెలిపింది.

అయితే ఈ క్షిపణి దాడి అణు విద్యుత్ కేంద్రంలో ఎలాంటి రేడియేషన్‌కు దారి తీయలేదని తెలిపింది. ఇరాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక అణు విద్యుత్ ప్లాంట్ ఇదే. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ కేంద్రంపై దాడి జరగడం ఇది నాలుగోసారి.

ఈ దాడి ఘటనపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా భవనాల్లో కీలకమైన పరికరాలు ఉండే అవకాశం ఉందని అన్నారు. అణు కేంద్రాల సమీప ప్రాంతాలపై ఎన్నడూ దాడి చేయకూడదని అన్నారు. అణు ప్రమాదం ముప్పును నివారించేందుకు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అణు భద్రత, రక్షణకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు.
Go Back to Shorts
Bushehr Nuclear Power Plant
Iran
Nuclear Power Plant
IAEA
Rafael Mariano Grossi
Missile Attack

More Telugu News