Sri Sailam: కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి
కరీంనగర్‌లో దారుణం జరిగింది. కసాయి తండ్రి కన్నబిడ్డలను బావిలోకి తోసేసి చంపేశాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్‌లో జరిగింది. భార్యతో గొడవపడిన శ్రీశైలం అనే వ్యక్తి ఐదు సంవత్సరాల కవల పిల్లలను బావిలోకి తోసేశాడు. ఆ తర్వాత బావిలోకి దూకి అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. కానీ ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
శ్రీశైలం చిన్నారులకు మొదట గడ్డిమందు తాగించి, ఆ తర్వాత బావిలోకి తోసేశాడు. స్థానికులు బావిలో వెతకగా ఒక బాలిక మృతదేహం లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. స్థానికులు ఆగ్రహంతో శ్రీశైలంను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమని పోలీసులుప్రాథమికంగా నిర్ధారించారు.