Advertisement

ఏపీలో తల్లికి వందనం నిధుల విడుదల.. పిల్లలే మన ఆస్తి అన్న నారా లోకేశ్

Nara Lokesh releases Thalliki Vandanam funds says children are our assets
  • రాష్ట్ర వ్యాప్తంగా 42.70 లక్షల మంది తల్లులకు లబ్ధి
  • రూ. 10,120.78 కోట్లను జమ చేయనున్న ప్రభుత్వం
  • పిల్లల చదువులు కుటుంబానికి తరగని ఆస్తి అన్న లోకేశ్

విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42.70 లక్షల మంది అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తోంది. ప్రతి విద్యార్థి తల్లికి రూ.13,000 చొప్పున అందుతున్న ఈ నిధుల జమ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది.  


ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఆర్థిక సాయాన్ని అందజేయడం వల్ల విద్యార్థుల చదువులకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకావని అన్నారు. పిల్లలే మన అసలైన సంపదని, వారి చదువులే కుటుంబానికి తరగని ఆస్తి అని వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న ఆంక్షలను తొలగించి, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఈ పథకం ఫలాలను వేర్వేరుగా వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం చేస్తున్న దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతోందని వివరిస్తూ, పిల్లల చదువు కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి తల్లికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
Nara Lokesh
Thalliki Vandanam
Andhra Pradesh Government
Education Schemes in AP
Thalliki Vandanam Funds Release
Nara Lokesh Latest News

More Telugu News