తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో ఛార్జీల పెంపు.. నేటి నుంచి అమలు
- ఆయా సర్వీసులపై 50 శాతం మేర పెరిగిన ధరలు
- 'ఏ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.62కు పెంపు
- 'బీ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.80కు పెంపు
ఇప్పటి వరకు 'ఏ' కేటగిరీ కింద కనీస ఛార్జీ రూ.35 ఉండగా, దానిని రూ.35కు పెంచారు. ఇందులో అడంగల్, పహాణీ వంటి తక్షణ సేవలు ఉంటాయి. కేటగిరీ 'బీ' సర్వీసుల ఛార్జీని రూ.80కి పెంచారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయ్యే కుల, ఆదాయ ధృవీకరణ వంటి సేవల ధరలు రూ.80కి పెరిగాయి. ఇవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
మీ సేవ కేంద్రాల నిర్వహణ ఖర్చు పెరిగినందువల్ల ధరలను పెంచాలని నిర్వాహకులు కోరారు. ఈ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ధరల సవరణ చేపట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల ధరల పెంపు చోటుచేసుకుంది.