ముందు దేశానికి.. ఆ తర్వాత తల్లిదండ్రులకు.. ఆర్మీ చీఫ్ ఎమోషనల్ మూమెంట్
- 31వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన జనరల్ ధీరజ్ సేథ్
- మాజీ లెఫ్టినెంట్ జనరల్ అయిన తండ్రికి సెల్యూట్
- అనంతరం తల్లి ఆశీర్వాదం తీసుకున్న ఆర్మీ చీఫ్
- సోదరుడు ఆయనకు సెల్యూట్ చేయడం ప్రత్యేక ఆకర్షణ
- ఈ భావోద్వేగ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
అంతటితో ఆగకుండా తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. మరో విశేషం ఏంటంటే.. భారత నౌకాదళంలో రియర్ అడ్మిరల్‌గా ఉన్న ఆయన సోదరుడు రవ్నీష్ సేథ్ కూడా కొత్త ఆర్మీ చీఫ్‌కు సెల్యూట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంతకుముందు జనరల్ ధీరజ్ సేథ్ జాతీయ యుద్ధ స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అధికారికంగా ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. దేశ భద్రత, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
.