హార్దిక్ పాండ్య కోసం ఏడు ఐపీఎల్ జట్లు పోటీ? ముందంజలో సీఎస్‌కే

Seven IPL teams competing for Hardik Pandya CSK in the lead
  • ముంబైను పాండ్య వీడనున్నట్లు ప్రచారం
  • అతణ్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ
  • సీఎస్‌కేతో పాటు కేకేఆర్, రాజస్థాన్ రేసులో ఉన్నట్లు సమాచారం
  • ఆర్‌సీబీ, హైదరాబాద్ మాత్రమే ఆసక్తి చూపడం లేదని నివేదిక
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు జట్టును వీడే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అతణ్ని ట్రాన్స్‌ఫర్ విండోలో దక్కించుకోవడానికి ఏకంగా ఏడు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం వెల్లడించింది.

ఆ కథనం ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకునే రేసులో ముందంజలో ఉంది. సీఎస్‌కేకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) గట్టి పోటీ ఇస్తుండగా, రాజస్థాన్ రాయల్స్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్న జట్లలో ఒకటిగా పేర్కొంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని ఫ్రాంచైజీలు హార్దిక్‌పై ఆసక్తి కనబరుస్తున్నట్లు నివేదిక తెలిపింది.

2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన హార్దిక్ 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా మారాడు. అనంతరం మళ్లీ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చి కెప్టెన్సీ చేపట్టాడు. అయితే అతడి నాయకత్వంలో ముంబై గత మూడు సీజన్లలో పది, మూడు, తొమ్మిదో స్థానాల్లో నిలిచింది.

హార్దిక్ పాండ్య తన శిక్షణ కేంద్రాన్ని ముంబై నుంచి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు శాశ్వతంగా మార్చుకున్నాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న అతడు బెంగళూరు శివారులో నివాసం అద్దెకు తీసుకుని జాతీయ జట్టు లేదా ఐపీఎల్ లేని సమయంలో అక్కడే శిక్షణ కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Hardik Pandya
Chennai Super Kings
Mumbai Indians
IPL Transfer Window
IPL 2025
Kolkata Knight Riders

More Telugu News