ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్లు వీరే!

AP EAPCET 2026 Results Released These Are The Top Rankers
  • ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్
  • ఇంజినీరింగ్ విభాగంలో 70.52 శాతం విద్యార్థులు క్వాలిఫై
  • అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 89.59 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,76,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,82,317 మంది (70.52 శాతం) విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. 


అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా... 70,929 మంది పరీక్ష రాశారు. ఈ విభాగంలో ఏకంగా 63,546 మంది అంటే 89.59 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయి మంచి ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.


ఎప్‌సెట్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లు వీరే:
ఇంజినీరింగ్:
  • జొన్నల రోషన్‌ మణిదీప్‌ రెడ్డి - గుంటూరు
  • కోరుకొండ శ్రావ్య - శ్రీకాకుళం 
  • వెన్న ప్రవీణ్‌ కుమార్ రెడ్డి - పల్నాడు
  • తుంగ దుర్గా సుప్రభాత్‌ - పల్నాడు
  • తెల్లూరి శ్రేయస్‌ రెడ్డి - హైదరాబాద్‌
  • ముక్కార సాకేత్‌ - కడప
  • బండి వెంకట సాత్విక్‌ - గుంటూరు
  • నూర్‌ బాషా హఫీజ్‌ - గుంటూరు
  • పసల మోహిత్‌ - కడప
  • మరక వంశీధర్‌ రెడ్డి - కడప.

అగ్రికల్చర్ అండ్ ఫార్మా:
  • శంబంగి జశ్వంత్‌ నాయుడు - విజయనగరం
  • కుడుముల వెంకట మహంత్‌ అక్షజ్‌ రెడ్డి - మేడ్చల్‌ మల్కాజ్‌గిరి
  • కొండ్రెడ్డి హారికాదేవి శ్రీ అనూహ్య - కృష్ణా 
  • కర్రి సత్యనారాయణ - కాకినాడ
  • బంటు ధాత్రిక - అనకాపల్లి
  • పల్లికొండ దర్శ్‌తేజ  - కాకినాడ
  • వల్లెపు ధీరజ్‌ కృష్ణ - గుంటూరు
  • దండమూడి జాగృతి - గుంటూరు
  • ఆళ్ల శ్రీలక్ష్మి సత్యసాయి నిఖితారెడ్డి - పల్నాడు
  • రేలంగి జయ షణ్ముఖి - విజయనగరం.

AP EAPCET 2026
Nara Lokesh
AP EAPCET Results 2026
AP EAPCET Engineering Toppers
AP EAPCET Agriculture Results
Andhra Pradesh Education News

More Telugu News