Marco Rubio: ఇరాన్‌పై దాడులు, యుద్ధం ముగింపుపై అమెరికా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

Marco Rubio Comments on Iran Attacks and End of War
షార్ట్స్‌లో చూడండి
రాబోయే రెండు వారాల్లో తమ దాడులు పూర్తయ్యేసరికి ఇరాన్ చరిత్రలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తాము అనుకున్న దానికంటే ముందుగానే, మరికొన్ని వారాల్లో టెహ్రాన్‌‌పై దాడులు ముగిస్తామని తెలిపారు. భూతల దాడులు చేయకుండానే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌లో జీ7 ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

హర్మూజ్ గుండా జరిగే చమురు రవాణా మీద ఇరాన్ సుంకాలు విధించకుండా నిరోధించడమే అమెరికా తక్షణ కర్తవ్యమని తెలిపారు. ఈ సుంకాల కారణంగా అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం ముగింపుపై చర్చల కోసం ఇరాన్ పాలకవర్గం తమకు పలుమార్లు సందేశాలు పంపించిందని వెల్లడించారు.

ఆ తర్వాత తాము ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై మాత్రం స్పందించలేదని విమర్శించారు. ఇరాన్‌పై భూతల దాడులు చేయాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే మాత్రం వాటిని ఎదుర్కోవడానికి అమెరికా తమ దళాలను ఇరాన్ చుట్టూ మోహరిస్తోందని మార్కో రుబియో తెలిపారు.
Go Back to Shorts
Marco Rubio
Iran
US Secretary of State
G7 Summit
Tehran
Hormuz Strait
Oil Transportation

More Telugu News