శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
- ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది విభాగంలో స్కైట్రాక్స్ అవార్డు
- ఈ ఘనతను సాధించడం ఇది ఐదోసారి
- భారత్, దక్షిణాసియాలో మూడో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు
లండన్‌లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పో 2026 కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా విమానాశ్రయ సిబ్బంది స్నేహపూర్వక వైఖరి, సేవల నాణ్యతను అంచనా వేసి స్కైట్రాక్స్ ఈ పురస్కారాలను అందిస్తుంది. చెక్-ఇన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్, బోర్డింగ్ వంటి అన్ని విభాగాల్లో సిబ్బంది పనితీరును దీనికోసం పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ అవార్డుతో పాటు శంషాబాద్ విమానాశ్రయం మరికొన్ని ఘనతలను కూడా సాధించింది. భారత్, దక్షిణాసియాలో 'రెండో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం'గా, 'మూడో ఉత్తమ విమానాశ్రయం'గా నిలిచింది.