KKR: 'లైన్స్ ఆఫ్ లెగసీ' థీమ్‌తో కేకేఆర్ కొత్త జెర్సీ.. డిజైన్ ప్రత్యేకత ఇదే!

KKR New Jersey Unveiled with Lines of Legacy Theme
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు మూడుసార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. 'లైన్స్ ఆఫ్ లెగసీ' (వారసత్వపు గీతలు) అనే థీమ్‌తో ఈ జెర్సీని ప్రత్యేకంగా రూపొందించారు. జట్టు ప్రస్థానంలోని చారిత్రక, మరపురాని ఘట్టాలను గుర్తుచేసేలా దీని డిజైన్ ఉంది.

2008లో బ్రెండన్ మెకల్లమ్ ఆడిన 158 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ నుంచి, రింకూ సింగ్ చివరి ఓవర్లో కొట్టిన ఐదు సిక్సర్ల వరకు.. ఇలాంటి ఎన్నో ఐకానిక్ క్షణాలను గీతల రూపంలో జెర్సీపై పొందుపరిచారు. ఈ గీతలన్నీ కలిసి కేకేఆర్ (KKR) అక్షరాలను ఆవిష్కరించేలా వినూత్నంగా డిజైన్ చేశారు. "ఈ జ్ఞాపకాలను జెర్సీలో భాగం చేయడం ద్వారా అభిమానులు జట్టు కథలో ఒక భాగాన్ని ధరించే అవకాశం కల్పిస్తున్నాం" అని కేకేఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ జెర్సీ ఆవిష్కరణపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. "ఈ జెర్సీ కేకేఆర్ సుదీర్ఘ ప్రయాణాన్ని, జట్టు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మా వారసత్వం పట్ల మేం గర్విస్తున్నాం" అని తెలిపారు.

బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల‌ 29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఏప్రిల్ 2న ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి హోం మ్యాచ్‌లో తలపడుతుంది. ఇక, ఈసారి వేలంలో కామెరాన్ గ్రీన్, మతీశ పతిరణ‌, రోవ్‌మన్ పావెల్ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసి కేకేఆర్ మరింత పటిష్ఠంగా మారింది.


KKR
Kolkata Knight Riders
IPL 2026
Lines of Legacy
KKR Jersey
Brendon McCullum
Rinku Singh
Venkky Mysore
Mumbai Indians
Sunrisers Hyderabad

More Telugu News