ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ సేఫ్ కాదు: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- జాతి వివక్ష, దాడుల ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ
- బలమైన, చట్టపరమైన చట్రాలు అవసరమన్న బీజేపీ ఎంపీ
- అట్రాసిటీ లాంటి చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి
కేంద్ర ప్రభుత్వంతోపాటు బీజేపీ ప్రభుత్వం ఉన్న దేశ రాజధానిలో ఈశాన్య ప్రజలపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షత చూపడంతోపాటు దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఈశాన్య ప్రాంతాల ప్రజలు జాతి వివక్ష, దాడులు, హత్యలను ఎదుర్కొంటున్నారని వాపోయారు. కేంద్ర హోంమంత్రిని కలిసి అట్రాసిటీ లాంటి చట్టాన్ని తీసుకురావాలని కోరతామని తపిర్ గావో అన్నారు.