శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి... అమెరికా ముందే హెచ్చరించిందా?

IRIS Dena Iran Warship Attacked off Sri Lanka Coast
  • వెంటనే నౌకను వదిలిపెట్టి వెళ్లాలని అమెరికా హెచ్చరించినట్లు వార్తలు
  • నౌకలోని ఓ సిబ్బంది తన తండ్రికి ఫోన్ చేసి వెల్లడించడంతో వెలుగులోకి..
  • కమాండర్ ఆదేశాలను ధిక్కరించి లైఫ్ బోట్లను ఆశ్రయించిన కొంతమంది నావికులు
శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై దాడికి ముందు అమెరికా హెచ్చరికలు జారీ చేసిందా? అంటే అవుననే అంటున్నారు. గత నెలలో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు వచ్చిన ఇరాన్ యుద్ధ నౌక తిరిగి వెళుతున్న సమయంలో అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచివేసింది. అయితే దాడికి ముందు నౌకలోని సిబ్బందిని అమెరికా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

వెంటనే నౌకను వదిలిపెట్టి వెళ్లాలని ఇరాన్ యుద్ధ నౌక కమాండర్‌ను రెండుసార్లు ఆదేశించినట్లు తెలుస్తోంది. జలాంతర్గామి దాడికి కొన్ని నిమిషాల ముందు నౌకలోని ఓ సిబ్బంది తన తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మార్చి 4న జలాంతర్గామి నుంచి హెచ్చరికలు వచ్చాయని, సిబ్బంది ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచన చేశారని తెలుస్తోంది.

అయితే యుద్ధ నౌక కమాండర్ మాత్రం అందుకు ససేమీరా అన్నారు. దీనితో సిబ్బందిలోని కొంతమంది కమాండర్‌తో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. కొంతమంది కమాండర్ ఆదేశాలను ధిక్కరించి లైఫ్ బోట్ల ద్వారా ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది. అమెరికా జలాంతర్గామి నుంచి హెచ్చరికలు వచ్చాయని తెలిపిన నౌక సిబ్బంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
Advertisement
IRIS Dena
Iran warship
Sri Lanka
America
Visakhapatnam
International Fleet Review

More Telugu News