ఆరేళ్ల బాలుడి వినతిపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- బస్సు సౌకర్యం కోసం మంత్రిని కోరిన ఆరేళ్ల బాలుడు
- ఖమ్మం జిల్లాలో ప్రజా దర్బార్ సందర్భంగా ఈ ఘటన
- వారంలో బస్సు నడపాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
- సర్వే అవసరం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం
తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఒక ఆరేళ్ల బాలుడు సమర్పించిన వినతిపత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అంశంపై తక్షణమే స్పందించిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వారం రోజుల్లోగా బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆ చిన్నారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఖమ్మం జిల్లా కల్లూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో ఈ ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు తన తండ్రితో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశాడు. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని, వెంటనే బస్సును ఏర్పాటు చేయాలని కోరుతూ స్వహస్తాలతో రాసిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశాడు.
ఆ చిన్నారి చొరవను, ధైర్యాన్ని చూసి ముచ్చటపడిన మంత్రి తక్షణమే స్పందించారు. అక్కడే ఉన్న టీజీఎస్ఆర్టీసీ అధికారులను పిలిచి, సదరు గ్రామానికి బస్సు సర్వీసును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అయితే, నిబంధనల ప్రకారం ముందుగా సర్వే నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు వివరించగా, మంత్రి అందుకు సమ్మతించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారం రోజుల్లోగా బస్సు ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ బస్సు రాకపోతే నేరుగా తనకు ఫోన్ చేయాలని ఆ బాలుడికి భరోసా ఇచ్చారు.