Sara Tendulkar: అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో సారా టెండూల్కర్ రాయల్ లుక్.. అందరి కళ్లూ ఆమె నెక్లెస్‌పైనే!

Sara Tendulkar Shines at Brothers Wedding Necklace Steals the Show
  • ధగధగలాడిన మీనాకారి నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన సారా 
  • ఆమె ధరించిన హారం ధర సుమారు రూ. 40 నుంచి 60 లక్షల వరకు ఉంటుందని అంచనా
  • ప్రముఖ డిజైనర్ సునీతా షెకావత్ కలెక్షన్‌కు చెందిన ఈ ఆభరణం
  • వజ్రాలు, పచ్చలతో 360 గంటల పాటు శ్రమించి తయారు చేసినట్లు వెల్లడి
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ విందు ముంబైలో బంధుమిత్రులు, ప్రముఖుల నడుమ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ధరించిన ఓ అద్భుతమైన నెక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫ్యాషన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాని ఖరీదు, తయారీకి పట్టిన సమయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

ఈ విందులో సారా గులాబీ రంగు చీరలో మెరిసిపోయారు. అయితే, అందరి దృష్టి ఆమె మెడలోని మీనాకారి నెక్లెస్‌పైనే పడింది. సెలబ్రిటీ జ్యువెలరీ నిపుణుడు ప్రియాన్ష్ గోయల్ ప్రకారం సారా ధరించిన ఈ నెక్లెస్ విలువ సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల మధ్య ఉంటుందని అంచనా. జైపూర్‌కు చెందిన కళాకారులు అత్యంత నైపుణ్యంతో ఈ హారాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సంప్రదాయ కుందన్ పోల్కీ, ఫ్లోరల్ మోటిఫ్‌లతో కూడిన ఈ నెక్లెస్‌ను తయారు చేయడానికి దాదాపు 360 గంటల సమయం పట్టిందని ప్రియాన్ష్ వివరించారు.

ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ సునీతా షెకావత్ తన కలెక్షన్‌కు చెందిన ఈ ఆభరణం వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీని తయారీలో అత్యంత నాణ్యమైన వజ్రాలు, కొలంబియన్ పచ్చలు, సౌత్ సీ ముత్యాలను ఉపయోగించినట్లు ఆమె వెల్లడించారు. ప్రఖ్యాత డిజైనర్ మనీశ్‌ మల్హోత్రా రూపొందించిన పింక్ శారీలో సారా చూడచక్కగా కనిపించగా, ఈ మీనాకారి ఆభరణం ఆమె అందానికి మరింత వన్నె తెచ్చింది. టాప్ క్రీడాకారులు, సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో సారా తన రాయల్ లుక్‌తో అందరినీ కట్టిపడేశారు. మొత్తం మీద అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో సారా ధరించిన ఈ ఖరీదైన ఆభరణం గురించే ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Sara Tendulkar
Arjun Tendulkar wedding
Sachin Tendulkar
Sara Tendulkar necklace
Meenakari necklace
Indian jewelry
Celebrity fashion
Mumbai wedding
Manish Malhotra
Sunita Shekhawat

More Telugu News