ఏకాగ్రత తగ్గుతోందా? చిన్న చిన్న అలవాట్లే మెదడుపై ప్రభావం చూపిస్తున్నాయా?
- తరచూ మతిమరుపు, ఏకాగ్రత లోపం బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు
- నిద్రలేమి, ఒత్తిడితో మెదడు పనితీరుపై ప్రభావం
- నీటి కొరత, పోషకాల లోపం కూడా కారణాలు
- థైరాయిడ్, హార్మోన్ల మార్పులు, కొన్ని మందుల వల్ల కూడా ప్రభావం
- క్రమబద్ధమైన నిద్ర, సమతుల ఆహారం, వ్యాయామంతో ప్రయోజనం
ఏదో పని కోసం గదిలోకి వెళ్లి.. అక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోతున్నారా? మాట్లాడుతుండగా తెలిసిన పదాలు కూడా గుర్తుకు రావడం లేదా? చేసే పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారా? అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. కానీ తరచూ మతిమరుపు, ఆలోచనల్లో మందగమనం, ఏకాగ్రత లోపం వేధిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వైద్య పరిభాషలో ఈ లక్షణాల సముదాయాన్ని ‘బ్రెయిన్ ఫాగ్’ (మెదడు మొద్దుబారడం) అంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? మన రోజువారీ అలవాట్లకు దీనికి సంబంధం ఉందా?
నిద్ర సరిగా లేకపోతే..
రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం, మధ్యలో పదేపదే మెలకువ రావడం, నిద్ర వేళలు మారిపోవడం మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గడం, పనిపై దృష్టి నిలపలేకపోవడం, రోజంతా అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్రకు ముందు ఫోన్ ఎక్కువసేపు చూడటం కూడా నిద్రకు ఆటంకం కలిగించవచ్చు.
ఆహారం, నీరు కూడా కీలకమే!
సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత నీరు తాగకపోవడం శరీరంలో శక్తి తగ్గడానికి కారణమవుతాయి. విటమిన్ బి12, ఇనుము వంటి పోషకాల లోపం కూడా అలసట, ఏకాగ్రత సమస్యలకు దారితీయవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం, శరీరానికి సరిపడా నీరు అందించడం ముఖ్యం.
ఒత్తిడితో ఆలోచనలకు బ్రేక్
పని ఒత్తిడి, ఆందోళన ఎక్కువైతే ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. సమాచారాన్ని గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం కూడా నెమ్మదించవచ్చు. పనుల మధ్య చిన్న విరామాలు తీసుకోవడం, రోజువారీ పనులను ప్రణాళిక ప్రకారం చేసుకోవడం కొంత ఉపశమనం కలిగించవచ్చు.
ఆరోగ్య సమస్యలూ కారణం కావచ్చు
థైరాయిడ్ సమస్యలు, హార్మోన్లలో మార్పులు, కొన్ని ఇన్ఫెక్షన్లు, కొవిడ్ తర్వాత కొనసాగే లక్షణాలు బ్రెయిన్ ఫాగ్‌కు కారణమవుతాయి. కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. అందుకే దీన్ని కేవలం అలసటగా భావించకూడదు.
ఎలా బయటపడాలి?
రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, శారీరక శ్రమకు సమయం కేటాయించడం ఉపయోగపడతాయి. పనులను చిన్న భాగాలుగా విభజించుకోవడం, అవసరమైన విషయాలను రాసుకోవడం కూడా ఏకాగ్రతకు తోడ్పడతాయి. అయితే మతిమరుపు, ఆలోచనల్లో మందగమనం తరచూ వస్తున్నా.. రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తున్నా వైద్యులను సంప్రదించాలి. కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ముఖ్యం.