Allu Arjun: అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పిన అర్ధాంగి స్నేహారెడ్డి
- అల్లు అర్జున్, స్నేహారెడ్డి పెళ్లికి నేటితో 15 ఏళ్లు పూర్తి
- సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెట్టిన స్టార్ కపుల్
- అయాన్, అర్హ, రెండు కుక్కలే మా ప్రపంచమన్న స్నేహ
- బన్నీ వెడ్డింగ్ యానివర్సరీ రోజే తమ్ముడు శిరీష్ వివాహం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. నేడు (మార్చి 6) అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఈ జంట పెళ్లి చేసుకుని నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయింది.
ఈ స్పెషల్ డే సందర్భంగా స్నేహారెడ్డి తన భర్తతో ఉన్న ఫొటోలతో పాటు పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. "15 ఏళ్ల తర్వాత.. మనం ప్రేమతో నిండిన జీవితాన్ని నిర్మించుకున్నాం. మన ఇద్దరు పిల్లలు, మన రెండు పెంపుడు కుక్కలే నాకు సర్వస్వం. ఎన్నో జ్ఞాపకాలు మన సొంతం. నా జీవితంలోని ప్రతి దశలోనూ నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు" అంటూ స్నేహ రాసుకొచ్చారు.
మరోవైపు అల్లు అర్జున్ కూడా భార్యకు శుభాకాంక్షలు చెబుతూ.. "హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. 15 ఏళ్ల బంధం ఇది. నువ్వు లేకపోతే ఈ ప్రయాణం ఇంత అందంగా ఉండేది కాదు" అంటూ పోస్ట్ చేశారు. అలాగే నవ్వులు, స్నేహంతో నిండిన జీవితం అంటూ స్నేహతో ఉన్న మరో బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కూడా పంచుకున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ స్నేహితులుగా మారి, అనంతరం ప్రేమించి, పెద్దలను ఒప్పించి 2011 మార్చిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
మరో ఆసక్తికరమైన విశేషమేమిటంటే.. సరిగ్గా అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు అవుతున్నాడు. నయనికా రెడ్డితో శిరీష్ వివాహం నేడే (మార్చి 6) జరుగుతుండటంతో అల్లు వారి ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ఒకపక్క తమ వెడ్డింగ్ యానివర్సరీ, మరోపక్క తమ్ముడి పెళ్లి కావడంతో అల్లు అర్జున్ ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం అల్లు అర్జున్, స్నేహ ఇద్దరూ శిరీష్ పెళ్లి వేడుకల్లో సందడి చేస్తూ ఆ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు.