నాకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: దానం నాగేందర్
- నెక్లెస్ రోడ్డులో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న దానం నాగేందర్
- స్పీకర్ నుంచి వ్యక్తిగతంగా నోటీసులు రాలేదని వెల్లడి
- రేపో ఎల్లుండో వెళ్లి తన అభిప్రాయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తానన్న దానం నాగేందర్
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో దానం నాగేందర్ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ఆయన కాసేపు హోలీ ఆడారు. అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో ఆయన అనర్హత పిటిషన్ అంశంపై మాట్లాడారు. తన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చి యువతతో డ్యాన్స్ చేశానని తెలిపారు.