Nara Lokesh: ఉండవల్లిలో లోకేశ్ ఆత్మీయ విందు.. నెల్లూరు, తిరుపతి నేతలతో సందడి
- కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ప్రజాప్రతినిధులు
- సమస్యల పరిష్కారంపై నేతలకు వ్యక్తిగత నివేదికల పంపిణీ
- విందుకు వచ్చిన మహిళలకు మంగళగిరి పట్టు చీరలు బహుకరించిన మంత్రి
విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా, ఒక కుటుంబ వేడుకలా ఆద్యంతం సందడిగా సాగింది. ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విందులో పాల్గొన్నారు.
విందుకు హాజరైన ప్రతి ఒక్కరినీ మంత్రి లోకేశ్ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. వారి పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన మహిళలకు, నేతల కుటుంబ సభ్యులకు మంగళగిరి పట్టుచీరలను బహుమతిగా అందించి ప్రత్యేకంగా గౌరవించారు.
ఈ కార్యక్రమం కేవలం పలకరింపులకే పరిమితం కాలేదు. తనదైన పనితీరును చాటుతూ, ప్రజాప్రతినిధులు గతంలో తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారంపై లోకేశ్ ఒక నివేదికను సిద్ధం చేశారు. ఏ పనులు పూర్తయ్యాయి, ఏవి పెండింగ్‌లో ఉన్నాయి, వాటి కారణాలు ఏమిటనే వివరాలతో కూడిన రిపోర్టులను సంబంధిత నేతలకు స్వయంగా అందజేశారు.
ఈ ఆత్మీయ కలయికలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి.నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు.