బాలకృష్ణకు గాయం.. స్పందించిన సీఎం చంద్రబాబు

Balakrishna Injured CM Chandrababu Naidu Responds
  • NBK111 సినిమా షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం
  • బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు
  • ఆయనది అలుపెరగని స్ఫూర్తి అంటూ ఎక్స్‌లో పోస్ట్
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సెట్‌లో స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆయన స్పందించారు.

"సెట్‌లో బాలకృష్ణ గారికి గాయమైందని తెలిసి ఆయనతో మాట్లాడాను. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆయనది అలుపెరగని స్ఫూర్తి. త్వరలోనే మళ్లీ షూటింగ్‌కు హాజరవుతారు. త్వరగా కోలుకోండి" అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.

ప్రస్తుతం కాకినాడలో 'NBK111' చిత్ర షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని ఒక యాక్షన్ సన్నివేశంలో పాల్గొన్నప్పుడు బాలకృష్ణ కండరానికి గాయమైంది. అయితే ఇది చిన్న గాయమేనని, స్వల్ప చికిత్సతో ఆయన త్వరలోనే కోలుకుంటారని చిత్రబృందం స్పష్టం చేసింది.

ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అభిమానులు, శ్రేయోభిలాషులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు మద్దతుగా సందేశాలు పంపుతున్నారు. బాలకృష్ణ పూర్తిగా కోలుకున్న వెంటనే సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
Advertisement
Nandamuri Balakrishna
Chandrababu Naidu
NBK111 Movie
Balakrishna Injury
Gopichand Malineni
Kakinada

More Telugu News