ఢిల్లీ మద్యం కేసులో కవితకు క్లీన్ చిట్.. స్పందించిన ధర్మపురి అరవింద్
- ఈ కేసులో సాక్ష్యాలు లేవని మాత్రమే కోర్టు తెలిపిందన్న ఎంపీ
- కవితకు క్లీన్ చిట్ రాలేదని అరవింద్ వ్యాఖ్య
- రాజకీయాల్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతారన్న ఎంపీ
ఈ అంశంపై ఎంపీ అరవింద్ స్పందిస్తూ, ఈ కేసులో సాక్ష్యాలు లేవని మాత్రమే కోర్టు తెలిపిందని, కానీ క్లీన్ చిట్ ఇవ్వలేదని వెల్లడించారు. కవిత ఆరోపిస్తున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారని, వాటన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
కవితకు క్లీన్ చిట్ రావడంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా స్పందించారు. ఇది బీజేపీ రాజకీయ డ్రామాగా ఆయన అభివర్ణించారు. పార్టీలు, నాయకులతో అవసరం ఉంటే ఒకలా, అవసరం తీరాక మరోలా బీజేపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. శత్రువు మిత్రుడు కావొచ్చు మిత్రుడు శత్రువు కావొచ్చని విమర్శించారు.