టీ20 సూపర్ 8... న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Sri Lanka chooses to bowl after winning the toss against New Zealand
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ఒక్కో మార్పుతో రెండు జట్లు బరిలోకి దిగాయి. శ్రీలంక జట్టులోకి మిషిరా స్థానంలో అసలంక రాగా, న్యూజిలాండ్ జట్టులోకి ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ స్థానంలో కోలె మెకాంచీ వచ్చాడు. సెమీస్ రేసులో నిలవాలంటే ఇరుజట్లకూ ఇందులో విజయం సాధించడం అవసరం.

శ్రీలంక జట్టులో పాథున్ నిశాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, డాసున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషాన్ హేమంత, దుష్యంత చమీర, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక ఉన్నారు.

న్యూజిలాండ్ జట్టులో టిమ్ సీఫెర్డ్ (వికెట్ కీపర్), ఫిన్ ఆలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్ మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోలె మెక్ కాంచీ, మాట్ హెన్రీ, ఐష్ సోధి, లాకీ ఫెర్గుసన్ ఉన్నారు.
Go Back to Shorts
Sri Lanka Cricket
New Zealand Cricket
T20 World Cup
Super 8
Dasun Shanaka
Mitchell Santner

More Telugu News