'ఏఐ'పై టీసీఎస్ సీఈవో కృతివాసన్ ఆసక్తికర వ్యాఖ్య
- ఏఐ వల్ల సంభవించే మార్పులకు అనుగుణంగా కంపెనీ విధానాలు మార్చుకుంటోందని వెల్లడి
- ఏఐ సాంకేతికతకు టీసీఎస్ భయపడదని వ్యాఖ్య
- ఏఐ సాంకేతికత వినియోగంతో స్వీయ ఆదాయం తగ్గినా ఫర్వాలేదన్న టీసీఎస్
ఏఐ ఆధారిత సాంకేతిక వినియోగంలో యువ నిపుణులతో పోలిస్తే సీనియర్ స్థాయి ఉద్యోగులు నెమ్మదిగా ఉన్నారని తెలిపారు. తమ కంపెనీకి చెందిన ఆరు లక్షల మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యం ఉండాలని భావిస్తున్నామని అన్నారు. ఉద్యోగులు కూడా అందుకు అనుగుణంగా కష్టపడాలని సూచించారు. ఉపాధి అవకాశాలను నూతన సాంకేతికత దెబ్బతీస్తుందనే అంశంపై టీసీఎస్ భయపడదని తెలిపారు.