ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో అభిషేక్.. టాప్-5లోకి ఇషాన్

Abhishek Sharma Remains No 1 Ishan Kishan Enters Top 5 in ICC T20 Rankings
ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన నంబర్ వ‌న్‌ ర్యాంకును పదిలంగా నిలబెట్టుకోగా, వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తొలిసారి టాప్-5లోకి దూసుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు పెద్దగా రాణించకపోయినా, అభిషేక్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్‌పై 62 పాయింట్ల ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. ఇదే జాబితాలో ఇషాన్ కిషన్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకుకు చేరుకోవడం విశేషం. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో ర్యాంకును అందుకున్నాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో ర్యాంకుకు చేరాడు.

బౌలింగ్ విభాగంలోనూ భారత ఆధిపత్యం కనిపించింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నంబర్ వ‌న్‌ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకులో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Go Back to Shorts
Abhishek Sharma
ICC T20 Rankings
Ishan Kishan
T20 World Cup
Varun Chakravarthi
Jasprit Bumrah
Shivam Dube
Sikandar Raza
Cricket Rankings
Sahibzada Farhan

More Telugu News