Jio Intelligence: ఢిల్లీ 'ఏఐ ఇంపాక్ట్' సదస్సులో సమాధానాలిచ్చే కృష్ణార్జునుల హైటెక్ డిజిటల్ రూపాలు
- తమ స్టాల్‌లో ఏర్పాటు చేసిన జియో ఇంటెలిజెన్స్ విభాగం
- అత్యాధునిక హోలోగ్రామ్ సాంకేతికత, కృత్రిమ మేధతో రూపొందించినట్లు వెల్లడి
- సందర్శకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేలా ఏర్పాటు
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 'ఏఐ ఇంపాక్ట్' సదస్సులో రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటు చేసిన కృష్ణార్జునుల హైటెక్ డిజిటల్ రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యాధునిక హోలోగ్రామ్ సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలను రూపొందించింది. 'మహాభారత్: ఏక్ ధర్మ్ యుద్ధ్' సిరీస్‌లోని పలు పాత్రల డిజిటల్ రూపాలను తమ స్టాల్‌లో ప్రదర్శించింది.
సందర్శకులు అడిగిన ప్రశ్నలకు కృష్ణుడు, అర్జునుడు డిజిటల్ రూపాలు సమాధానం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఇది సందర్శకులను బాగా ఆకట్టుకుంది. ఈ స్టాల్‌లో ఏర్పాటు చేసిన ఇతర చిత్రాలు కూడా సందర్శకులతో మాట్లాడేలా రూపొందించారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మన యువతకు ఇతిహాసాలపై ఆసక్తి కలిగించే ఉద్దేశంలో భాగంగా దీనిని ఏర్పాటు చేసినట్లు జియో ఇంటెలిజెన్స్ స్టాల్ నిర్వహకులు తెలిపారు. కాగా, 'మహాభారత్: ఏక్ ధర్మ్ యుద్ధ్' సిరీస్ జియో హాట్ స్టార్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.