15 ఏళ్ల సమయమిచ్చినా మీరేం చేయలేరు.. నాకు 5 నిమిషాలు ఇచ్చే దమ్ముందా?: రాజాసింగ్

Raja Singh dares Owaisi give me 5 minutes
షార్ట్స్‌లో చూడండి
మజ్లిస్ పార్టీ, ఒవైసీ సోదరులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు 15 నిమిషాలు అడిగారు, కానీ నాకు ఐదు నిమిషాల సమయం ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ మాట్లాడుతూ, తమకు 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులు లేకుండా చేస్తానని అన్నారని మండిపడ్డారు.

15 నిమిషాలు కాదు 15 గంటలు, 15 రోజులు, 15 నెలలు అవసరమైతే 15 సంవత్సరాలు ఇచ్చినా మీరేం చేయలేరని అన్నారు. మీ పూర్వీకులే హిందువులను ఏం చేయలేకపోయారు మీరేం చేస్తారని మండిపడ్డారు. కానీ తమకు ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని అన్నారు. తాను ఎక్కడకు రావాలో చెప్పాలని అన్నారు. నీ ప్రాంతానికి రావాలా, నీ ఇంటికి రావాలా, ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తానని అన్నారు. తనకు కత్తి, తుపాకీ ఏదీ వద్దని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Raja Singh
Raja Singh comments
Majlis Party
Owaisi brothers
Goshamahal MLA
Hindu politics

More Telugu News