Narendra Modi: ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ అంత ఎత్తుకు వెళ్లే హెలికాప్టర్ తయారుచేస్తాం: మోదీ

Narendra Modi Everest Height Helicopter to be Made with France
  • ముంబైలో ద్వైపాక్షిక అంశాలపై మోదీ, మేక్రాన్ చర్చలు
  • భారత్, ఫ్రాన్స్ సంబంధాలు ప్రత్యేకమైనవి అన్న మోదీ
  • ఫ్రాన్స్ భారత్‌కు దశాబ్దాలుగా వ్యూహాత్మక భాగస్వామి అని వెల్లడి
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ అంత ఎత్తుకు వెళ్లగలిగే హెలికాప్టర్‌ను తయారుచేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలోని లోక్ భవన్‌లో సమావేశమైన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మేక్రాన్ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అంతకుముందు, కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్ బస్ హెచ్-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్‌ను మోదీ, మేక్రాన్ కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత్, ఫ్రాన్స్ సంబంధాలు ప్రత్యేకమైనవని అన్నారు. ఆ దేశం దశాబ్దాలుగా భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా ఉందని అన్నారు. కాగా, మేక్రాన్ తన పర్యటనలో భాగంగా ఢిల్లీలో జరగనున్న 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో పాల్గొననున్నారు. మేక్రాన్ నేటి నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.
Narendra Modi
France
Emmanuel Macron
Helicopter Manufacturing
Airbus H-125
India France Relations

More Telugu News