Kalvakuntla Kavitha: మా గెలుపుతో కల్వకుంట్ల కవితకు సంబంధం లేదు: వడ్డేపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha Has No Connection to Our Victory Says Vaddepally Srinivas
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు పలికిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. మొత్తం 10 వార్డులకు గాను 8 వార్డుల్లో సింహం గుర్తుపై గెలిచి సంచలనం సృష్టించారు. ఈ గెలుపు చర్చనీయాంశంగా మారుతున్న వేళ, కవిత విజయం గురించి చర్చ ప్రారంభమైన వేళ... ఆమెకు షాక్ తగిలింది. తమ విజయంతో కవితకు ఎలాంటి సంబంధిం లేదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలిచిన వడ్డేపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఓ న్యూస్ చానల్ తో వడ్డేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... తమ విజయంతో జాగృతికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఫారం తీసుకోవడానికి వెళ్లినప్పుడు కవిత తమకు జాగృతి కండువా కప్పారని... కానీ, ఆమె తమ తరపున ప్రచారానికి వచ్చిందే లేదని చెప్పారు. ప్రచారంలో తాము కవిత కండువా వేసుకున్నది కూడా లేదని, ఆ రోజు తర్వాత కవితతో తాము మాట్లాడింది కూడా లేదని తెలిపారు. ఈ గెలుపు తమ సొంతమని చెప్పారు. శ్రీనివాస్ వ్యాఖ్యలపై కవిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Go Back to Shorts
Kalvakuntla Kavitha
Vaddepally Srinivas
Telangana Municipal Elections
All India Forward Bloc
Jogulamba Gadwal district
Vaddepally Municipality
Telangana Jagruthi
Municipal Election Results

More Telugu News