మున్సిపల్ పోరులో హామీల బాండ్ పేపర్
- సుల్తానాబాద్ లో సొంత డబ్బుతో సంక్షేమ పథకాలకు అభ్యర్థి హామీ
- పెళ్లికి రూ.25 వేలు, ఆడపిల్ల పుడితే రూ.10 వేలు అందిస్తానని వెల్లడి
- బాండ్ పేపర్ తో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం
సుల్తానాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి ఆల్ ఇండియా ఫ్వార్వార్డ్ బ్లాక్ పార్టీ తరఫున గొట్టం మహేశ్ పోటీ చేస్తున్నారు. తనను గెలిపిస్తే చేపట్టబోయే పనులు, వార్డు ప్రజల సంక్షేమం కోసం అమలు చేయబోయే పథకాలను మహేశ్ ఓ బాండ్ పేపర్ పై రాసి మరీ విడుదల చేశారు. వార్డులో పెళ్లి చేసుకునే యువతులకు రూ.25,016 కానుక, ఆడపిల్ల పుడితే రూ.10,016, మగ పిల్లాడు పుడితే రూ.5,016 అందిస్తానని చెప్పారు. ఈ హామీలను అమలు చేయలేకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ లో పేర్కొన్నారు.