Mrunal Thakur: అతడితో విడిపోయినందుకు బాధ లేదు... జాలిపడ్డాను: బ్రేకప్‌పై మృణాల్ ఠాకూర్
- లవ్ బ్రేకప్‌పై స్పందించిన నటి మృణాల్ ఠాకూర్
- నా దూకుడు, నేను నటించడం నచ్చలేదని అతను విడిపోయాడని వెల్లడి
- విడిపోయినందుకు బాధపడలేదని, అతడిపై జాలి మాత్రమే వేసిందని వ్యాఖ్య
- ధనుష్, శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్ రూమర్లను కొట్టిపారేసిన మృణాల్
తెలుగులోనూ, పలు ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఇటీవల తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పైనా, గతంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడడంపైనా ఆమె స్పందించారు. నటుడు ధనుష్, క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. "ఇలాంటి రూమర్స్ వింటే నవ్వొస్తుంది. వాటిని ఉచిత పబ్లిసిటీ స్టంట్స్‌గా చూస్తాను" అని పేర్కొన్నారు.
అంతేకాదు, తన పాత లవ్ స్టోరీని కూడా గుర్తుచేసుకున్నారు. "నాకు దూకుడు ఎక్కువని, నాతో ఉండలేనని అతడు బ్రేకప్ చెప్పాడు. నేను యాక్టింగ్ చేయడం కూడా అతనికి ఇష్టం లేదు. అందుకే విడిపోయాం" అని తెలిపారు. అయితే, ఈ బ్రేకప్ పట్ల తాను ఏమాత్రం బాధపడలేదని, పైగా అతని ఆలోచనా విధానం పట్ల జాలిపడ్డానని అన్నారు. "అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో కొనసాగితే, భవిష్యత్తులో పిల్లలు కూడా అదే భావనలతో పెరుగుతారు. అది నాకు ఇష్టం లేదు" అని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం తన కొత్త చిత్రం 'దో దీవానే శహర్ మే' ప్రమోషన్లలో బిజీగా ఉన్న మృణాల్, ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.