Sreeleela: నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీలో సందడి చేసిన శ్రీలీల

Sreeleela Attends Narasaraopeta Engineering College Fest
షార్ట్స్‌లో చూడండి
సినిమాలలో హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తూనే ఈవెంట్స్‌కు కూడా హాజరయ్యే నటి శ్రీలీల తాజాగా నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ఫెస్ట్‌కు హాజరై విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ మిమ్మల్ని చూసిన జోష్‌లో అరిచి అరిచి గొంతు పోయిందంటూ సరదాగా వ్యాఖ్యానించింది. అందుకు స్పందించిన అక్కడి యువకులు డ్యాన్స్‌ చేయమని అరిచారు. అది విన్న శ్రీలీల .. ‘నిజంగా పెళ్లాన్ని అడిగినట్టే అడిగారు.. డ్యాన్స్‌ చేద్దాం.. కమాన్‌’ అంటూ పాజిటివ్‌గా స్పందించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

పెళ్లి సందD మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిన శ్రీలీల తక్కువ కాలంలోనే టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్‌కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ మూవీలో నటిస్తుండగా, హిందీలో కార్తీక్‌ ఆర్యన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌లోనూ కనిపించనుంది. అంతేకాదు, కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ మూవీలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. 
Go Back to Shorts
Sreeleela
Narasaraopeta Engineering College
Ustaad Bhagat Singh
Pawan Kalyan
Kartik Aaryan
Dhanush
Tollywood
Heroine
Movie Events
Viral Video

More Telugu News