Sreeleela: అల్లు అర్జున్‌తో ఆ క్షణాలు.. స్పెషల్ పోస్ట్‌తో ఆకట్టుకున్న శ్రీలీల
- పుష్ప 2లోని 'కిస్సిక్' పాటకు ఏడాది పూర్తి
- అల్లు అర్జున్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసిన శ్రీలీల
- 2024లో విడుదలై రికార్డులు సృష్టించిన 'పుష్ప: ది రూల్'
యంగ్ సెన్సేషన్ శ్రీలీల, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’లోని ‘కిస్సిక్’ సాంగ్ విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీలీల సోషల్ మీడియా వేదికగా కొన్ని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలోని మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ పాటకు సంబంధించిన షూటింగ్ సెట్లోని ఫొటోలు, వీడియోలను శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీటిలో కొన్నింటిలో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కూడా ఉన్నారు. "కిస్సిక్ పాటకు ఏడాది #గ్రేట్ఫుల్" అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
2024లో విడుదలైన 'పుష్ప 2: ది రూల్', 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా, తెలుగులో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పలు రికార్డులను నెలకొల్పింది.
ఇక, శ్రీలీల కెరీర్ విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పరశక్తి' అనే పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోగా శివకార్తికేయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, తన పాత్రకు శ్రీలీల డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. 'కిస్' చిత్రంతో అరంగేట్రం చేసిన ఆమె, 'ధమాకా', 'భగవంత్ కేసరి', 'గుంటూరు కారం' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు.