నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ... సీబీఐ కోర్టు నుంచి లోటస్ పాండ్ కు చేరుకున్న జగన్
- అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్
- ఏ1గా పిలవగానే కోర్టు హాల్లోకి వెళ్లి సంతకం చేసిన వైనం
- విచారణ అనంతరం లోటస్ పాండ్ నివాసానికి తిరుగుపయనం
కాగా, ఈ కేసులో జగన్ తదుపరి విచారణకు ఎప్పుడు హాజరు కావాలనే అంశంపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు, కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్, నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసమైన లోటస్ పాండ్‌కు వెళ్లారు. లోటస్ పాండ్ వద్దకు అప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. లోటస్ పాండ్ లోకి కేవలం కొద్ది మంది కీలక నేతలు మాత్రమే వెళ్లారు. వీరితో జగన్ గంటన్నర పాటు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణకు చెందిన వైసీపీ కీలక నేతలు కూడా జగన్ ను కలవనున్నారు. హైదరాబాద్ నుంచి జగన్ బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, మీడియాతో జగన్ మాట్లాడతారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.