శివసేన నేత ఇంట్లో రూ. 2.65 కోట్ల చోరీ.. నమ్మకస్తుడే నిందితుడు!
- శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సచిన్ అహిర్ వర్లీ నివాసంలో ఆభరణాలు, నగదు చోరీ
- 20 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రవీణ్ రమేశ్ సోలంకిని అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్
- నిందితుడిని జులై 28 వరకు పోలీస్ కస్టడీకి పంపిన ముంబై కోర్టు
మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్, శివసేన (మహాయుతి కూటమి) నేత సచిన్ అహిర్ ముంబై వర్లీ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోని ఆభరణాలు, బంగారు బిస్కట్లు, డైమండ్ నగలు, వెండి వస్తువులు, నగదుతో కలిపి దాదాపు రూ. 2.65 కోట్ల విలువైన వస్తువులు మాయమయ్యాయి. దాదాపు 20 ఏళ్లుగా ఆ ఇంట్లోనే నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తే ఈ చోరీకి పాల్పడటం గమనార్హం.
అరెస్టయిన నిందితుడిని ప్రవీణ్ రమేశ్ సోలంకి (45)గా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. కోర్టులో హాజరుపరచగా జులై 28 వరకు పోలీస్ కస్టడీ విధించారు. నిందితుడు గత రెండు దశాబ్దాలుగా సచిన్ అహిర్ కుటుంబంతో కలిసి ఉంటుండటంతో ఇంట్లోని విలువైన వస్తువులు ఎక్కడ భద్రపరుస్తారో తెలుసుకున్నాడు. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని గత మూడేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా కొద్దికొద్దిగా బంగారం, ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తూ వచ్చాడు.
గత వారం అహిర్ వర్లీ నివాసంలో విలువైన ఆభరణం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే లాకర్లు, ఇతర పెట్టెలు తెరిచి చూడగా కోట్ల విలువైన పలు ఆభరణాలు మాయమైనట్లు బయటపడింది. సచిన్ అహిర్ కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో వర్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
ఒక నగల వ్యాపారికి నిందితుడు విక్రయించిన 325 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తును అమ్మి వచ్చిన సొమ్మును తన అనుచరులతో పంచుకున్నట్లు సోలంకి విచారణలో అంగీకరించాడు. ఈ నేరంలో పాల్గొని ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ముగ్గురు గృహ కార్మికుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీనే మహాయుతి అభ్యర్థిగా సచిన్ అహిర్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.