చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష
- పదేళ్ల క్రితం మేయర్ దంపతుల దారుణ హత్య
- 23 మంది నిందితులలో ఐదుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం
- ఉరిశిక్ష పడిన దోషులలో మేయర్ భర్త మేనల్లుడు చింటూ
విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసులు నిందితుడిగా పేర్కొన్న కాసరం రమేశ్ ను ఈ కేసులో నుంచి తప్పించింది. మరో నిందితుడు ఎస్. శ్రీనివాసాచారి మరణించాడు. ఈ హత్యలో మిగతా 21 మంది నిందితుల పాత్రపై కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇందులో ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. తాజాగా శుక్రవారం ఈ ఐదుగురు నిందితులను ఉరి తీయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.
ఉరిశిక్ష పడిన నిందితులు
- శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ (మేయర్ భర్త మోహన్ మేనల్లుడు)
- గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్
- జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జయారెడ్డి
- మంజునాథ్ అలియాస్ మంజు
- మునిరత్నం వెంకటేష్