అడవిలో అన్వేషణ .. ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్!
- క్రైమ్ థ్రిల్లర్ గా 'జనావర్'
- 8 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
- అడవి నేపథ్యంలో సాగే కథ
- ప్రధానమైన పాత్రలో భువనన్ అరోరా
- ఈ నెల 26 నుంచి జీ5లో స్ట్రీమింగ్
ఈ సిరీస్ ను ఈ నెల 26వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. 8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. దినేశ్ .. అభిషేక్ .. హరీశ్ నిర్మించిన ఈ సిరీస్ కి, శచింద్ర దర్శకత్వం వహించాడు. భువన్ అరోరా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ లో, భగవాన్ తివారీ .. అతుల్ కాలే .. వైభవ్ యశ్వీర్ .. ఎషికా డే .. వినోద్ సూర్యవంశీ .. అమిత్ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
అది ఒక దట్టమైన అడవి .. ఆ అడవిలో తలలేని ఒక మొండెం ఉన్నట్టుగా ఒక సమాచారం బయటికి వస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ హేమంత్ కుమార్ రంగంలోకి దిగుతాడు. ఆ మొండెం ఎవరిది? హంతకుడు ఎవరు? కనుక్కోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇది తాను అనుకున్నంత తేలికైన కేసు కాదనే విషయం అతనికి అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేది కథ.