Temples: చంద్ర గ్రహణం తర్వాత తెరుచుకున్న ఆలయాలు
- ఆలయాల్లో సంప్రదాయ పద్ధతిలో శుద్ధి, సంప్రోక్షణలు
- వేకువ జాము నుంచి తెరుచుకున్న ఆలయాలు
- భక్తులకు స్వామివారి దర్శనాల అనుమతి
చంద్రగ్రహణం ముగిసిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు తిరిగి భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం ముందు ఆలయాలు మూసివేయడం, శుద్ధి అనంతరం మాత్రమే తిరిగి తెరవడం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఈ నేపథ్యంలో అన్ని ఆలయాల్లోనూ సంప్రదాయ పద్ధతిలో శుద్ధి, సంప్రోక్షణలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు.
తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమలలో శ్రీవారి ఆలయం వేకువ జామున 2:40 గంటలకు పునఃప్రారంభమైంది. ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం అర్చకులు ఏకాంతంగా సుప్రభాత సేవ నిర్వహించారు. భక్తుల రద్దీ కారణంగా టోకెన్లు లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
శ్రీశైలం మల్లన్న ఆలయం
శ్రీశైలంలో ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనాలు ప్రారంభమయ్యాయి.
సింహాచల దేవస్థానం
విశాఖపట్నం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు.
శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం – బురుజుపేట, విశాఖపట్నం
ఇక్కడ కూడా ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి లభించింది.
బాసర సరస్వతీ దేవస్థానం
బాసరలో ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాల్లోనూ వేకువజామున మహా సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుప్రభాత సేవ, విశేష అభిషేకం, మహా నివేదన, నీరాజనం, మహామంత్ర పుష్పార్చన నిర్వహించారు. ఆలయంలో అక్షరాభ్యాసాలు, ఆర్జిత సేవలు యథావిధిగా పునఃప్రారంభమయ్యాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
యాదగిరిగుట్టలో ఆలయ ద్వారాలు తెల్లవారుజామున 3:30 గంటలకు తెరిచారు. అర్చకులు సంప్రోక్షణ నిర్వహించి నిత్య కైంకర్యాలు పూర్తిచేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు.
ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయం – విజయవాడ
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయంలో ఉదయం 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. సంప్రోక్షణ, పూజా కార్యక్రమాల అనంతరం దర్శనం ప్రారంభమైంది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం
తెల్లవారుజామున 3 గంటలకు భద్రాచలం రామాలయం తలుపులు తెరుచుకున్నాయి. సుప్రభాత సేవ అనంతరం గోదావరి జలాలతో ఆలయ శుద్ధి చేశారు. అనంతరం మూలవిరాట్ సీతారాములకు అభిషేకం, మహానివేదన అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి లభించింది.