17వ రోజుకు చేరుకున్న సినీ కార్మికుల సమ్మె... సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
- రంగంలోకి దిగిన తెలంగాణ ప్రభుత్వం
- సినిమా హబ్ లక్ష్యానికి దెబ్బ అని సర్కార్ ఆందోళన
- ఫెడరేషన్ నేతలతో మాట్లాడనున్న డీజీపీ
హైదరాబాద్‌ను దేశంలోనే ప్రధాన సినిమా హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ సమ్మె అడ్డంకిగా మారిందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర సినిమా పాలసీపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి అధికారులు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఒక విడత చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా, ఈరోజు ఫెడరేషన్ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. డీజీపీ సైతం ఫెడరేషన్ నేతలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.