హాస్టల్‌లో యువతి ప్రసవం.. బిడ్డ‌ను తీసుకెళ్లి ఆసుప‌త్రిలో అప్ప‌గించిన ప్రియుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హాస్టల్‌లో యువతి ప్రసవం.. బిడ్డ‌ను తీసుకెళ్లి ఆసుప‌త్రిలో అప్ప‌గించిన ప్రియుడు

Tamil Nadu A Young Woman Gave Birth in A Hostel
  • త‌మిళ‌నాడు రాజధాని చెన్నైలో ఘ‌ట‌న
  • మొద‌ట రోడ్డుపై బిడ్డ దొరికింద‌ని ఆసుప‌త్రి సిబ్బందితో చెప్పిన యువ‌కుడు
  • అక్క‌డే ఉన్న పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో యువ‌కుడి విచార‌ణ‌
  • ఆ బిడ్డ త‌న‌కు, త‌న ల‌వ‌ర్‌కు పుట్టాడ‌ని చెప్పిన యువ‌కుడు
  • ఏం చేయాలో తోచ‌క ఆసుప‌త్రిలో అప్ప‌గించ‌డానికి వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డి
త‌మిళ‌నాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగుచూసింది. రోడ్డుపై బిడ్డ దొరికిందంటూ ఓ యువ‌కుడు సంచిలో తీసుకొచ్చి ఆసుప‌త్రిలో అప్ప‌గించాడు. వివ‌రాల్లోకి వెళితే... చెన్నై ప‌రిధిలోని ట్రిప్లికేన్‌లోని ఓమందూరార్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి శ‌నివారం మ‌ధ్యాహ్నం ఓ యువ‌కుడు పుట్టి ఒక్క‌రోజే అయిన శిశువును సంచిలో తీసుకొచ్చాడు. త‌న‌కు ఆ శిశువు రోడ్డుపై దొరికింద‌ని ఆసుప‌త్రి సిబ్బందితో చెప్పాడు. 

అయితే, అదే స‌మ‌యంలో అక్క‌డున్న పోలీసులు అనుమానంతో యువ‌కుడిని విచారించారు. ఆ స‌మ‌యంలో అత‌డు పోలీసుల‌కు పొంత‌న‌లేని స‌మాధానాలు చెప్పాడు. దాంతో యువ‌కుడిని పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. పీఎస్‌లో విచారించ‌గా... తాను ఊటీ నుంచి వ‌చ్చాన‌ని, త‌న పేరు ప్ర‌దీప్ అని చెప్పాడు. గ్రూప్‌-1 ఎగ్జామ్ కోసం చెన్నైలోని హాస్ట‌ల్‌లో ఉంటూ చ‌దువుతున్న‌ట్లు తెలిపాడు. 

ఈ క్ర‌మంలో గిండి వ‌ర్సిటీ హాస్ట‌ల్‌లో ఉంటూ ఎంఎస్‌సీ చ‌దువుతున్న ఓ యువ‌తితో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని, తాము శారీర‌కంగా ఒక్క‌టైన‌ట్లు తెలిపాడు. దాంతో ఆ యువ‌తి గ‌ర్భం దాల్చింద‌ని చెప్పాడు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం స‌ద‌రు యువ‌తి హాస్ట‌ల్‌లో బిడ్డ‌ను ప్ర‌స‌వించింద‌ని, ఏం చేయాలో తోచ‌క తాను బిడ్డ‌ను ఆసుప‌త్రిలో ఇచ్చేందుకు వ‌చ్చాన‌ని పోలీసుల‌తో అస‌లు నిజం చెప్పాడు. ప్ర‌దీప్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.          
Advertisement
Tamil Nadu
Pradeep
Chennai
Hostel Delivery
Infant Abandonment
любов
Group 1 Exam

More Telugu News