రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
- భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు
- కమ్చట్కా ద్వీపకల్పానికి సునామీ హెచ్చరికలు జారీ
- ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారుల సూచన
వీటిలో 7.4 తీవ్రతతో కూడిన భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీంతో కమ్చట్కా ద్వీపకల్పానికి పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్తినష్టం, ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.