సింహాచలం ఘటనపై కేటీఆర్ ఆవేదన
- సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి పలువురి మృతి
- ఈ వార్త తనను తీవ్రంగా బాధించిందన్న కేటీఆర్
- ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరమని వ్యాఖ్య
ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరమని, బాధితులందరికీ తన ప్రగాఢ సానుభూతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అది కూలిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.