బోరుగడ్డ అనిల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ
- సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
- గతంలో హైకోర్టును తప్పుదోవ పట్టించారనే కారణంతో తిరస్కరణ
- హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచన.
ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో బెయిల్ కోసం బోరుగడ్డ అనిల్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనకు తక్షణ ఉపశమనం లభించే అవకాశాలు మూసుకుపోయినట్లయింది.
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసు విచారణ కూడా కొనసాగుతోంది. 2023లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు తేజస్విని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు ఇటీవలే అనంతపురం కోర్టులో హాజరుపరిచారు.