సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. కేంద్ర ప్రభుత్వానికి ప్రీతి జింటా విజ్ఞప్తి

Sonam Wangchuk hunger strike Preity Zinta appeals to Central Government
  • సోనమ్ వాంగ్‌చుక్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలని నటి ప్రీతి జింటా విజ్ఞప్తి
  • నీట్ వంటి పరీక్షల్లో జవాబుదారీతనం కోరుతూ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
  • శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచన
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్పందించారు. ప్రభుత్వం ఆయనతో తక్షణమే చర్చలు జరిపి, సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం విదితమే.

'నీట్' వంటి పోటీ పరీక్షల్లో జవాబుదారీతనం పెంపొందించాలని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ ఈ దీక్షకు దిగారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అధికారులు ఆయన్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచే తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా స్పందిస్తూ, నిరసనకారులు లేవనెత్తుతున్న అంశాలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై పోలీసులు జరిపిన చర్యలు, పలువురు గాయపడిన ఘటనలతో ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ప్రీతి జింటా వంటి ప్రముఖులు మద్దతు ప్రకటించడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత చేకూరింది.
Advertisement
Sonam Wangchuk
Preity Zinta
Delhi Hunger Strike
Education Reforms NEET
Central Government

More Telugu News