Akada Ammayi Ikada Abbayi Trailer: న‌వ్వులు పూయిస్తున్న యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు 'అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి' ట్రైల‌ర్‌

Pradeep Machirajus Akada Ammayi Ikada Abbayi Trailer Out Now

  • '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?' అనే మూవీతో హీరోగా మారిన యాంక‌ర్‌ ప్ర‌దీప్ 
  • ఇప్పుడు 'అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి' అనే రెండో సినిమాతో వ‌స్తున్న యాంక‌ర్‌
  • ఏప్రిల్ 11న విడుద‌ల‌ కానున్న సినిమా... తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల‌

యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?' అనే సినిమాతో హీరోగా మారిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప‌ర్వాలేద‌నిపించ‌గా... ఇప్పుడు 'అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి' అనే రెండో మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుద‌ల‌ కానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా మేక‌ర్స్ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం న‌వ్వులు పూయిస్తోంది.

ట్రైలర్ చూస్తుంటే ఓ సివిల్ ఇంజనీర్ ఒక పల్లెటూరికి ఓ ప్రాజెక్టు పని మీద వెళతాడు. అక్కడ తాపీ పని వాళ్ల‌తో, ఆ ఊరి వాళ్ల‌తో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది చూపించారు. అలాగే ఆ ఊర్లో ఒకే ఒక్క అమ్మాయి ఉండటం, ఆ అమ్మాయితో హీరోకి లవ్, పెళ్లి వంటి ఆసక్తికర కథనంతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

జబర్దస్త్ కామెడీ షోతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్స్ నితిన్‌, భరత్‌ల ద‌ర్శ‌క‌త్వంలో, మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై ఈ సినిమా తెర‌కెక్కింది. ప్ర‌దీప్ స‌ర‌స‌న‌ దీపికా పిల్లి హీరోయిన్‌గా న‌టించారు. ర‌ధ‌న్ సంగీతం అందించారు. 

Akada Ammayi Ikada Abbayi Trailer
Pradeep Machiraju
Akada Ammayi Ikada Abbayi
Telugu Movie
Trailer Launch
Comedy Movie
Deepa Pilli
Nitin Bharat
Manks and Monkeys Banner
Tollywood
April 11 Release
  • Loading...

More Telugu News