లండన్ పార్కులో మమతా బెనర్జీ జాగింగ్.. వీడియో ఇదిగో!
––
లండన్ పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ లో పంచుకున్నారు. లండన్ కూడా కోల్ కతాలాంటి మహా నగరమేనని, గత చరిత్ర, నేటి డైనమిజం కలగలిసిన సిటీ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్ తో పశ్చిమ బెంగాల్ కు వందల సంవత్సరాల అనుబంధం ఉందని ఆమె గుర్తు చేశారు. సోమవారం అధికారిక కార్యక్రమాలు ప్రారంభించే ముందు లండన్ వాతావరణానికి అలవాటు పడేందుకు పార్క్ లో జాగింగ్ చేసినట్లు మమత తెలిపారు.